
- రాజన్న సిరిసిల్ల జోన్-3 డీఐజీ రమేశ్ నాయుడు
మెదక్ టౌన్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల బందోబస్తుకు పోలీసులు అందరూ సిద్ధంగా ఉండాలని రాజన్న- సిరిసిల్ల జోన్-3 డీఐజీ రమేశ్‌నాయుడు సూచించారు. మెదక్ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందన్నారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని చెప్పారు. అంతుకుముందు కొత్తగా నిర్మించిన ఎస్పీ కార్యాలయానికి వచ్చిన డీఐజీ రమేశ్నాయుడుకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఏఎస్పీ మహేందర్ బోకే అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.