చిన్నోనిపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

చిన్నోనిపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

గద్వాల, వెలుగు : ముంపు గ్రామమైన గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ లో గుప్త నిధుల తవ్వకాలు ఆదివారం కలకలం రేపాయి. చిన్నోనిపల్లి గ్రామం ముంపునకు గురవుతుండగా, నెల రోజుల నుంచి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని ఎర్రగట్టు తిమ్మప్ప స్వామి ఆలయంలోని గరుడ స్తంభం కింద తవ్వారు. 

ఇదే గుడిలో 15 రోజుల కింద నాగశేషుని పెకిలించారని, పుట్ట కింద కూడా తవ్వారని చెప్పారు. పురాతన ఆలయంలో గుప్తు నిధుల కోసం తవ్వుతున్నారని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.