టీశాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెట్ కంటెంట్ .. నవంబర్ 17 నుంచి 50 రోజుల పాటు క్లాసులు : సీఈవో వేణుగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించే టెట్-–2024 పరీక్ష కోసం టీశాట్ నెట్ వర్క్ స్పెషల్ డిజిటల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తున్నదని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.  టెట్ కు హాజరయ్యే అభ్యర్థుల కోసం కంటెంట్ ను అందిస్తున్నామని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్17 నుంచి 50 రోజుల పాటు 200 ఎపిసోడ్స్ కంటెంట్ ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. 

టీశాట్ నిపుణ చానల్ లో ఉదయం 6 –8 గంటల వరకు, విద్య చానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయంత్రం 5 –7 గంటల వరకు ప్రతి రోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలుంటాయని సీఈవో ప్రకటించారు.