- 1,000 జాబ్స్ఇస్తామన్న స్పిన్ సై టెక్నాలజీస్
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ హెల్త్కేర్ సొల్యూషన్స్ప్రొవైడర్ స్పిన్సై టెక్నాలజీస్ వెయ్యి ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించింది. వీరంతా తమ హైదరాబాద్ ఆఫీస్లో పనిచేస్తారని వెల్లడించింది. పేషెంట్ ఎంగేజ్మెంట్, క్లినికల్ కోలాబరేషన్ సేవల కోసం ఏఐని వాడతామని తెలిపింది.
ప్రతి సంవత్సరం అమెరికాలో నాలుగు కోట్ల మందికిపైగా రోగులకు తాము సేవలను అందిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో ఆపరేషన్లను విస్తరిస్తామని స్పిన్సై పేర్కొంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ నిపుణులను నియమిస్తామని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. విస్తరణ కోసం అమెరికాకు చెందిన ఆల్డిచ్ క్యాపిటల్ పార్ట్నర్స్ నుంచి నిధులు సేకరించామని సంస్థ సీఈఓ ఆండీ ఆసవా వివరించారు.