పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వ నమోదు

  • కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వాల నమోదుకు శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సమన్యాయం కల్పించడమే పార్టీ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ వచ్చిన ఆయన డిజిటల్ సభ్యత్వాల నమోదు జరుగుతున్న తీరును పరిశీలించారు. స్థానిక నేతలతో మాటా మంతీ జరిపారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు..? ఎవరు పని చేయడం లేదు..? అన్న విషయాలను అధినాయకత్వం గమనిస్తోందన్నారు. సభ్యత్వ  నమోదు కోసం పనిచేస్తున్న 24 వేల కార్యకర్తల వివరాలు రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయని వివరించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.