ట్రేడింగ్ పేరుతో 2 నెలల్లో రూ. 27 కోట్లు స్వాహా

ట్రేడింగ్ పేరుతో   2  నెలల్లో రూ. 27 కోట్లు స్వాహా

 డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.  ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగోడుతున్నారు. 2023 ఏడాదిలో తెలంగాణలో  మొత్తం 627 కేసులు నమోదుకాగా.. మొత్తం 3.9 కోట్ల రూపాయలు  దోచేశారని తెలంగాణ  సైబర్  సెక్యూరిటీ బ్యూరో, CID చీఫ్ షికా గోయల్  వెల్లడించారు. 2024 ఇప్పటి వరకు 213 కేసులు నమోదు కాగా.. రూ. 27.4 కోట్లు స్వాహా చేశారని తెలిపారు.  

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.  వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బాధితులను తరచూ ఈ మోసపూరిత ఆఫర్‌లతో లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIలు)మార్గాల ద్వారా  ఈజీ గా IPO పెట్టుబడులపై ఆకర్షణీయమైన రాబడిని అందించడం ద్వారా మోసగాళ్లు మెసేజ్ లు  పంపి పెట్టుబడిదారులను దోపిడీ చేస్తారు.  

ALSO READ :- ఓ వ్యక్తి బ్యాగులో బాంబు పెట్టి వెళ్లాడు : సీఎం సిద్ధరామయ్య

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయం చేసుకుంటారు.  నకిలీ వ్యాపార దరఖాస్తులను డౌన్‌లోడ్ చేయమని చెప్పి.. మోసగాళ్లకు వినియోగదారుల వ్యక్తిగత , ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేసి  బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేస్తారు.  బోగస్ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను చూపించే నకిలీ డ్యాష్‌బోర్డ్‌లను నమ్మొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు.