న్యూఢిల్లీ: ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఎస్‌జీపీసీ మాజీ ప్రెసిడెంట్ బిబి జాగిర్ కౌర్, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ బజ్వా, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్‌పర్సన్ మాంటెక్ సింగ్ ఆహ్లూవియా పాల్గొన్నారు.
అలాగే, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, కేంద్ర మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అజయ్ మాకెన్, సుఖ్జిందర్ రాంధావా, బీజేపీ నాయకులు ప్రణీత్ కౌర్, మన్జీందర్ సింగ్ సిర్సా తదితరులు హాజరయ్యారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ నివాసంలో నిర్వహించిన అఖండ్ పాత్ కార్యాక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, సోనియా గాంధీ, ఖర్గే పాల్గొన్నారు.