త్రిభాషా సూత్రంపై వివాదం వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళ నటి...

త్రిభాషా సూత్రంపై వివాదం వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళ నటి...

తమిళనాడులో త్రిభాషా సూత్రంపై వివాదం ముదిరిన వేళ బీజేపీకి షాక్ తగిలింది.. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు రంజనా నచియార్  పార్టీకి రాజీనామా చేశారు.ఆమె త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపింది. తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని బలవంతపెట్టడం తప్పని, తమిళ భాష ప్రభను తగ్గించే త్రిభాషా సూత్రానికి తాను వ్యతిరేకమని ఆమె అన్నారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు రంజనా నచియర్.

త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వార్ పీక్స్ కి చేరింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ( NEP - 2020 ) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసారిగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం జారీ ఆదేశాల్ని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించడం వివాదానికి దారి తీసింది. 
 

హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు ససేమిరా:

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్కూళ్లలో ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్ తో పాటు హిందీని కూడా తప్పనిసరిగా బోధించాలి. అయితే.. హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ససేమిరా అంటోంది. కేంద్రం నిర్ణయం భవిష్యత్తులో తమిళభాషను మరుగున పడేస్తుందని వాదిస్తోంది తమిళనాడు సర్కార్. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందన్నది స్టాలిన్ సర్కార్ వాదన.