
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. నేడు (ఏప్రిల్ 16న) దిల్ రాజు కొత్త AI ఆధారిత స్టూడియోను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
టాలీవుడ్ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే 'క్వాంటమ్ AI గ్లోబల్'తో కలిసి.. తన కొత్త AI స్టూడియోను మే 4న ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
Also Read:-జక్కన్న మాస్టర్ ప్లాన్.. కొత్త షెడ్యూల్తో పాటు.. SSMB29 బిగ్ సర్ప్రైజ్!
ఈ కంపెనీ ద్వారా AI ఉత్పత్తి చేసే అధునాతన సాధనాలను తయారుచేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ క్రేజీ అప్డేట్ టాలీవుడ్ను ఊపేస్తోంది. మే 4న AI-కంపెనీకి సంబంధించిన టైటిల్తో పాటు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వీడియోలో తెలిపారు.
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా (TFDC) ఉన్నారు. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రీబ్యూట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే 50 కి పైగా చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచారు. అంతేకాకుండా అనేక సినిమాలను డిస్ట్రీబ్యూట్ చేసి మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్నారు.