హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 2024, డిసెంబర్ 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు అంచెలుఅంచెలుగా ఎదిగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా నిలదొక్కకున్నారు. 1990లో పెళ్లి పందిరి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అక్కడి నుండి మెల్ల మెల్లగా ఎదుగుతూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించారు. 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా దిల్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫేమ్ తో పాటు ఆయన పేరు మారిపోయింది.
Also Read : అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సమంత మూవీ
దిల్‌రాజు అసలు పేలు వెంకటరమణారెడ్డి కాగా.. దిల్ సినిమా సక్సెస్ కావడంతో ఆయన పేరు వెంకటరమణారెడ్డి కాస్త దిల్ రాజుగా మారింది. ఇండస్ట్రీలో క్యాలిక్ లేడేడ్ ప్రొడ్యూసర్ అని ఆయనకు పేరుంది. సినిమాల విషయంలో అచితూచీ వ్యవహరించడమే ఇందుకు కారణం. బడా హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడంలో దిల్ రాజు ముందుంటారు.
ఎంతో మంది యంగ్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్‌కు ఇండస్ట్రీలో ఆయన లైఫ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతోన్న దిల్ రాజు.. ప్రస్తుతం మూడు భారీ చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న గేమ్‌ఛేంజర్ ఇందులో కీలకమైనది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా 2025, జనవరి 12న రిలీజ్ కానుంది.
ఇక, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం, నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతోన్న తమ్ముడు సినిమాలకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన రెండు భారీ ప్రాజెక్టులు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.