టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా బిగెస్ట్ హిట్ అవ్వడంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్ర టీమ్ తో కలసి తిరుమలకి వెళ్ళాడు. ఇందులోభాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, దిల్ రాజు దంపతులు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలియో తదితరులు తిరుమలేశుడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు చిత్ర యూనిట్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు పత్రికా విలేఖర్లతో మాట్లాడారు. ఇందులోభాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే 6వ రోజు ఎఫ్ 2 సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని ఆడియన్స్ కి ఇంతమంచి సినిమా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ మరియు చిత్ర్హ యూనిట్ అందరికీ థాంక్స్ తెలిపాడు.
Also Read : 5 రోజుల్లో రూ.161 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం
ఈ క్రమంలో ఓ రిపోర్టర్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి అడగ్గానే స్పందించకుండా వెళ్ళిపోయాడు. ఇక నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇది 8వ సినిమాని దీంతో ఏకంగా 8వ వండర్ గా తీసాడని చెప్పుకొచ్చాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో మరిన్ని మంచి హిట్ సినిమాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా భాషల్లో జనవరి 10న రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో మొదటి రోజు ఏకంగా 186 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ ఉండటంతో మరుసటి రోజునుంచి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేకపోవడంతో షోలు తగ్గించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పెంచారు.