Dil Raju: హీరోలు, ఆర్టిస్ట్లు సేఫ్.. నిర్మాతకే నష్టం.. దిల్ రాజు కామెంట్స్

Dil Raju: హీరోలు, ఆర్టిస్ట్లు సేఫ్.. నిర్మాతకే నష్టం.. దిల్ రాజు కామెంట్స్

స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC). దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా మళ్ళీ వెండితెరపైకి రానుంది. 2013 లో విడుదలైన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో సందడి చేయనుంది.

నేడు (మార్చి 5న) SVSC మూవీ రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పైరసీపై దిల్ రాజు కామెంట్స్ చేశాడు. ఏదైనా సినిమా పైరసీకి గురయితే ప్రొడ్యూసర్ మాత్రమే నష్టపోతున్నారు. కానీ, హీరోలు, ఆర్టిస్ట్ లు సేఫ్ గా ఉంటున్నారు.

ఇక వారు తమ నెక్స్ట్ సినిమా షూటింగ్స్ తో బిజీగా మారిపోతున్నారు. వేరే ప్రొడ్యూసర్ నష్టపోతే మాకేంటి అని అనుకుంటున్నారు. తమవరకు వస్తే కానీ నొప్పి తెలీదు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని నిర్మాత దిల్ రాజు అన్నారు.

ప్రస్తుతం దిల్ రాజు 'నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌ గా' మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కీలక పదవిలో ఉన్నాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌‌డీసీ) చైర్మన్‎గా ఆయన ఇటేవలే ఎన్నికయ్యారు. దాంతో FDC చైర్మన్ గా పైరసీపై కట్టుదిట్టమైన చర్యలు ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే ప్రభుత్వానికి ఒక త్వరలో లెటర్ పంపబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన కామెంట్స్ పై తెలుగు సినీ హీరోల నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి.