DilRaju: కాంబోపై కాకుండా కథలపై దిల్ రాజ్ దృష్టి.. కొత్త కంటెంట్తో రెండు సినిమాలు

DilRaju: కాంబోపై కాకుండా కథలపై దిల్ రాజ్ దృష్టి.. కొత్త కంటెంట్తో రెండు సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్తో దిల్ రాజు కొత్త సినిమాల లిస్ట్ ఊపందుకుంది. లేటెస్ట్గా దిల్ రాజు ప్రొడక్షన్స్ రెండు కొత్త సినిమాలను లైన్‌లో పెట్టింది. వాటిలో ఒకటి మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతుంది.

నేడు (మార్చి 20న) ఈ ప్రాజెక్ట్కి సంబంధించి దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. 'కథ చెప్పడంలో కొత్త తరంగం ఎదురుచూస్తోంది.. మరిన్ని వివరాలు త్వరలో…'అంటూ నిర్మాతలు కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. 

ఇటీవలే ఉన్ని ముకుందన్ హీరోగా ‘మార్కో’ సినిమాను తెరకెక్కించాడు హనీఫ్‌ అదేని. ఈ దర్శకుడిని టాలీవుడ్కు పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తారని తెలుస్తోంది. 

ALSO READ | పాటల కాంట్రవర్సీ: గేమ్ ఛేంజర్ స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌.. తమన్ సంచలన వ్యాఖ్యలు

అలాగే, నాని నిర్మించిన కోర్ట్ మూవీలో నటించిన నటులతో దిల్ రాజు మరో మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే, శివాజీ, యంగ్ హీరో హర్ష్ రోషన్ లను దిల్ రాజు లాక్ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రమేష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ మూవీకి  ‘తెల్ల కాగితం’అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు దిల్ రాజు ప్రొడక్షన్ వెల్లడించే అవకాశం ఉంది. 

ఇందులో శివాజీ మరింత పదునైన పాత్రలో నటించబోతున్నాడట. మంగపతి క్యారెక్టర్ను తలదన్నేలా పాత్రను తీర్చిదిద్దున్నారట. యంగ్ హీరో రోషన్ పాత్రకు సైతం మంచి రోల్ దక్కినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటీవలే దిల్ రాజు భారీ కాంబోపై దృష్టి పెట్టి, గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. దీంతో కాంబోపై కాకుండా కథపై, కథనాలపై దృష్టి పెట్టి ఈ కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి కథ కథనాలతో ఈ రెండు ప్రాజెక్ట్స్ రానున్నాయో అని ఆసక్తి నెలకొంది.