దేవర డే 1 కలెక్షన్ల రికార్డ్: ఏకంగా టాప్ 2 లో ఉండనుందా..?

దేవర డే 1 కలెక్షన్ల  రికార్డ్:  ఏకంగా టాప్ 2 లో ఉండనుందా..?

ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైంది. అయితే విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించిన దేవర ఇప్పుడు మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల రికార్డుపై కన్నేసింది. 

అయితే దేవర చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివ, సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.   ఇందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ  టాలీవుడ్ లో మొదటి రోజు  హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో దేవర 2వ స్థానంలో ఉండబోతున్నలు తెలిపాడు. 

అలాగే దేవర చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని చోట్ల నుంచి కలెక్షన్లు వివరాలు సేకరించి మొదటి రోజు గ్రాస్ కలక్షన్లు ఎంతనేది ప్రకటిస్తామని తెలిపాడు. 

ALSO READ | ఫ్యామిలీతో కలసి దేవర చిత్రాన్ని చుసిన జక్కన్న.

ఇక తెలుగు సినిమాలు మన దేశంలోనే కాకుండా చైనా, రష్యా, అమెరికా తదితర ఇతర దేశాలలో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయని దీంతో టాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సంపాదించడం తనకి గర్వ కారణంగా ఉందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్ లో తెలుగు సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకూ టాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఆర్.ఆర్.ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి 2 : ది కంక్లూజన్  (రూ.217 కోట్లు), కల్కి 2898 AD  (రూ.180 కోట్లు), సలార్ : ది సీస్ ఫైర్  (రూ.178.7 కోట్లు), ఆదిపురుష్  (రూ.140 కోట్లు) తదితర చిత్రాలు టాప్ 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరి దేవర చిత్రం మొదటి రోజు గ్రాస్ కలెక్షన్లు ఎంతనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.