ఇటీవల కాలంలో తాను నిర్మించిన సినిమాలకు అనుకున్న రిజల్ట్ రావటం లేదని.. దీంతో తనను తాను అనాలసిస్ చేసుకున్నాను అన్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న, ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాల కోసం మన ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. నార్త్, ఓవర్‌సీస్‌లో కూడా తెలుగు సినిమాలకు క్రేజ్, రేంజ్ పెరుగుతోంది. మా ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మూడున్నరేళ్ల ప్రయాణమిది. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్‌గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. శంకర్‌గారి ‘శివాజీ’ తరహాలో హీరో, విలన్ మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ కొట్టేలా ఉంటాయి. పాటల విజువల్ గ్రాండియర్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. శంకర్‌గారి ‘ఇండియన్ 2’ రిజల్ట్‌తో ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో ఈ కథ మీద చాలాసార్లు డిస్కషన్లు పెట్టుకున్నాం.
ఈ మూవీ రిజల్ట్ హీరోగారికి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. అనుకున్నట్టుగానే మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఇక నేను నిర్మించిన మరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. ‘ఎఫ్2’లాగా వీరి కాంబో మరోసారి బిగ్ హిట్ కాబోతోంది. అలా రెండు సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఆమధ్య వరుస పరాజయాలతో నాకు స్టోరీ జడ్జ్‌మెంట్ పోయిందా.. మళ్లీ కాంబినేషన్‌లకే వెళ్లాలా అని ఆలోచించా. చేతిలో ఉన్న సినిమాలపై సమీక్షించుకున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది.
గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్ అని నమ్మకంగా ఉన్నా. ఇక ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సపోర్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయి తిరుగు ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్‌లో చనిపోవడం బాధాకరం. వారికి చెరో రూ.5 లక్షలు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నా. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్ పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయంపై
తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే కలుస్తాం’’.