బీజేపీ స్కీమ్స్​ను​ ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్​ఆచారి

బీజేపీ స్కీమ్స్​ను​ ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్​ఆచారి

కందనూలు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్​ఆచారి తెలిపారు. ఆదివారం బిజినేపల్లి మండలంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్  నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డిని గద్దె దించాలని కోరారు.

కాంగ్రెస్  పార్టీ ఇస్తున్న హామీలను ఎక్కడ అమలు చేశారో నిలదీయాలని ప్రజలకు సూచించాలని చెప్పారు. బీసీలకు అధిక సీట్లు కేటాయించడంతో పాటు బీసీ సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించారన్నారు. నాగర్ కర్నూల్ లో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆచారి, సుధాకర్ రెడ్డి, తిరుపతయ్య, విష్ణుమూర్తి, భూషయ్య పాల్గొన్నారు.