అసభ్యకరంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటూ హీరోయిన్ సీరియస్...

అసభ్యకరంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటూ హీరోయిన్ సీరియస్...

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం "దిల్ రూబా". ఈ సినిమాలో కిరణ్ కి జంటగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ నటించగా విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. మంచి లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 14న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఐతే  "దిల్ రూబా" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ సీరియస్ అయ్యింది. 

అసౌకర్యంగా ఉన్న సమయంలో కొందరు హీరోయిన్ల ఫోటోలని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని అది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే స్టేజీమీద ఎమ్ జరుగుతుందో తెలిసి కూడా తమ ఫోటోలని వ్యూస్, రీచ్ కోసం ఇలా సోషల్ మీడియా పేజీలలో షేర్ చెయ్యడంతో ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన ఫోటోలని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి పేరు చెప్పకుండానే మరోసారి ఇలా జరిగితే బాగొదంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ :ఆ హీరోయిన్ కంటే రష్మికకి అన్ని రూ.కోట్లు రెమ్యునరేషన్ ఎక్కువట.. అందుకేనా..?

ఈ విషయం ఇలా ఉండగా నటి రుక్సార్ థిల్లాన్ తెలుగులో ఆమధ్య నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత "అశోక వనంలో అర్జున కల్యాణం, ఏబీసీడీ, స్పార్క్ లైఫ్, తదితర సినిమాల్లో కనిపించింది. కానీ సరైన బ్రేక్ రాకపోడంతో ఆఫర్లు పెద్దగా వరించడం లేదు. మరి దిల్ రూబా అయినా ఈ అమ్మడికి కెరీర్ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి..