దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తీర్పు ప్రకటించనున్న హైకోర్టు

దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తీర్పు ప్రకటించనున్న హైకోర్టు

హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. ఏప్రిల్ 8న (మంగళవారం) హైకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. 2013లో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబు పేలుళ్లలో 18 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది. 

ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. అయితే.. NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా.. హైకోర్టులో ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో.. రేపు(ఏప్రిల్ 8, మంగళవారం) హైకోర్టు తీర్పు ప్రకటించనుంది.

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.

ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ (యూపీ), జియా-ఉర్‌-రెహమాన్‌ (పాకిస్థాన్‌), తెహసీన్‌ అక్తర్‌ (బీహార్‌), అజాజ్‌ షేక్‌ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీనితో పాటు దాదాపు పదికి పైగా బాంబు పేలుళ్ల ఘటనల్లో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది.