హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల షాపుల అసోసియేషన్లు సెల్ఫ్ లాక్డౌన్ ను ప్రకటిస్తున్నాయి. మొన్న సికింద్రాబాద్, నిన్న బేగం బజార్ అసోసియేషన్లు సెల్ఫ్ లాక్డౌన ను ప్రకటించాయి. తాజాగా దిల్ సుఖ్ నగర్ అసోసియేషన్ కూడా సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించింది. దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని క్లాత్ మార్కెట్ జూన్ 29 నుంచి జూలై 5 వరకు బంద్ ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ నిర్ణయంతో దాదాపు 200పైగా షాపులు మూతపడనున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కరోనా తీవ్రతను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది.
For More News..