
ఇప్పటి వరకూ గ్లామర్ రోల్స్‌తో ఎక్కువగా ఆకట్టుకున్న డింపుల్ హయతి.. ఈసారి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఫిదా చేయబోతోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమె ఓ కీలకపాత్రను పోషించబోతోంది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఇందులో క్రూషియల్ రోల్ కోసం డింపుల్‌ను ఎంపిక చేసినట్టు సోమవారం ప్రకటించారు.
డింపుల్ పాత్ర ఇంటెన్స్‌తో కూడిన హై ఎనర్జీతో ఉంటుందని తెలియజేస్తూ ఆమె ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శర్వా కెరీర్‌లో ఇది 38వ చిత్రం. 1960 బ్యాక్‌డ్రాప్‌లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర బ్యాక్‌డ్రాప్‌లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక రవితేజతో ‘ఖిలాడి’, గోపీచంద్‌తో ‘రామబాణం’ సినిమాల్లో నటించిన డింపుల్‌కు గత కొన్నాళ్లుగా ఆఫర్స్ తగ్గాయి. మరి శర్వానంద్ సినిమాతో తిరిగి బిజీ అవుతుందేమో చూడాలి!