Dimuth Karunaratne: కెరీర్‌లో చివరి మ్యాచ్.. శ్రీలంక క్రికెటర్‌కు సచిన్‌ని మించిన గౌరవం

Dimuth Karunaratne: కెరీర్‌లో చివరి మ్యాచ్.. శ్రీలంక క్రికెటర్‌కు సచిన్‌ని మించిన గౌరవం

శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ లో తన చివరి మ్యాచ్ ఆడుతున్నాడు. గాలే వేదికగా గురువారం (ఫిబ్రవరి 6) శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ ప్రారంభమైంది. ఇది కరుణరత్నే కెరీర్ లో చివరిది. అంతేకాదు ఈ లంక ఓపెనర్ కెరీర్ లో 100 టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ కు ముందు కరుణరత్నేకు అరుదైన గౌరవం లభించింది. అతను బ్యాటింగ్ కు దిగినప్పుడు గార్డ్ ఆఫ్ హానర్ తో ప్లేయర్లు గ్రౌండ్ లో స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా, శ్రీలంక ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు. 

ప్రపంచ క్రికెట్ లో ఇది అతి పెద్ద గార్డ్ ఆఫ్ హానర్ గా చెప్పుకొస్తున్నారు. టీమిండియా ఆల్ టైం బెస్ట్ క్రికెటర్ సచిన్ కు సైతం ఇలాంటి ఘన స్వాగతం దక్కలేదని తెలుస్తుంది. చివరి మ్యాచ్ కు ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత ప్రధాన కోచ్ సనత్ జయసూర్య చేతుల మీదుగా తన 100 టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న కరుణరత్నే 34 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. తొలి రోజు లంచ్ సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. 

Also Read :- ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా

దశాబ్ద కాలంగా కరుణరత్నే శ్రీలంక తరపున టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు.  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో దిముత్ కరుణరత్నే వరుసగా 7, 0 పరుగులు చేశాడు. దీంతో జట్టుకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో తప్పుకుంటున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కెరీర్ లో ఇప్పటివరకు 99 టెస్టులాడిన ఈ లంక ఓపెనర్ 189 ఇన్నింగ్స్ ల్లో 39 యావరేజ్ తో 7172 పరుగులు చేశాడు. 50 వన్డేల్లో 1316 పరుగులు చేశాడు.