world expensive currency : విలువైన కరెన్సీగా కువైట్ దినార్

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదంటే.. చాలా మంది టక్కున చెప్పే సమాధానం అమెరికన్ డాలర్, యూరో. కానీ అది నిజమనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. ఆ దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇప్పుడు కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా మారింది. ఒక దినార్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ.270.41కు చేరడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమిని రియాల్ రూ.211.39 విలువైన కరెన్సీల  లిస్టులో ఉన్నాయి. అమెరికా డాలర్ విలువ రూ.81.36గా, బ్రిటన్ పౌండ్ రూ. 100, యూరో వాల్యూ రూ.88గా ఉంది.