బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ జరుగుతోంది. నాలుగో రోజు ఆటలో భాగంగా నేడు (ఏప్రిల్ 2) మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ మధ్యలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దినేష్ చందీమాల్ అనూహ్యంగా తప్పుకున్నాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ' కారణంగా చందీమాల్ నాలుగో రోజు జట్టు నుండి వైదొలగాల్సి వచ్చింది. అతను నేడు బంగ్లాదేశ్ నుండి నేడు శ్రీలంక బయలు దేరి వస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
శ్రీలంక క్రికెట్, అతని సహచరులు, కోచింగ్ స్టాఫ్ దినేష్ చండిమాల్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ అనే విషయం తెలియాల్సి ఉంది. అతని కుటుంబ ప్రైవసీని అభిమానులు అర్ధం చేసుకోవాలని అభ్యర్థించారు. గత నెలలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ మధ్యలోనే ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇలాగే తప్పుకున్నాడు. రేపటితో చివరి రోజు కావడంతో చందీమాల్ జట్టుతో కలిసే అవకాశాలు కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులు చేసిన చాందీమల్.. రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 531 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 178 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్లు విజృంభించడంతో 7 వికెట్లకు 157 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 511 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది.
A substitute will take Dinesh Chandimal's place in the field during Bangladesh's chase in Chattogram https://t.co/wlByuLFwJB #BANvSL pic.twitter.com/eJXKks6auE
— ESPNcricinfo (@ESPNcricinfo) April 2, 2024