Dinesh Karthik: ధోనీని మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేశాను: దినేష్ కార్తీక్

Dinesh Karthik: ధోనీని మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేశాను: దినేష్ కార్తీక్

టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇటీవలే తన ఆల్ టైం భారత జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది తీవ్ర విమర్శలు గుప్పించారు. వరల్డ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కపోయినా పర్లేదు.. ఆల్ టైం భారత జట్టులో చోటు దక్కపోవడమేంటి అని షాకవుతున్నారు నెటిజన్స్. తాజాగా దినేష్ కార్తీక్ తాను ప్రకటించిన ఆల్ టైం ప్లేయింగ్ 11 ధోని లేకపోవడం గురించి ప్రస్తావించాడు. 

"ధోనీని ఎంపిక చేయకుండా నేను పెద్ద పొరపాటు చేశాను. నేను ఎపిసోడ్ బయటకు వచ్చినప్పుడు ఈ విషయాన్నీ నేను గ్రహించాను.  నా ప్లేయింగ్ 11 లో వికెట్ కీపర్ ను మర్చిపోయాను. అదృష్టవశాత్తూ రాహుల్ ద్రవిడ్ ఉండడంతో అందరూ అతన్ని వికెట్ కీపర్ గా భావించారు.  వికెట్ కీపర్ ను సెలక్ట్ చేయడం మర్చిపోయాను. నా జట్టులో మార్పు చేయవలసి వస్తే ధోనీ ఉంటాడు. అతను ఏ ఫార్మాట్ లోనైనా ఖచ్చితంగా నా జట్టులో  ఉంటాడు. అతన్ని ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. నేను ఆడిన గొప్ప క్రికెటర్లలో అతను ఒకడని నేను భావిస్తున్నాను. ఏ భారత జట్టుకైనా అతడే కెప్టెన్ గా ఉంటాడు". అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. 

కార్తీక్  ఇటీవలే తన ఆల్ టైం భారత జట్టును ప్రకటించాడు. తన ప్లేయింగ్ 11 లో ఐదుగురు బ్యాటర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ఇద్దరు స్పిన్నర్లు..  ఇద్దరు పేసర్‌లను ఎంచుకున్నాడు. ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా  రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లను సెలక్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఆడతాడు.         

ALSO READ | NZ vs SL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్.. కారణం ఏంటంటే..?

ఆల్ రౌండర్లుగా యువరాజ్ సింగ్.. రవీంద్ర జడేజా వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. కార్తీక్ తన జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు చోటిచ్చాడు. రవి చంద్రన్ అశ్విన్ తో పాటు లెజెండరీ స్పిన్నర్ అనీల్ కుంబ్లేలకు స్థానం దక్కింది. కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఈ జట్టులో ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జహీర్ ఖాన్ తో పాటు.. జస్ప్రీత్ బుమ్రా కార్తీక్ జట్టులో అవకాశం దక్కించుకున్నారు.

దినేష్ కార్తీక్ ప్లేయింగ్ XI :

వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్..  హర్భజన్ సింగ్(12 ఆటగాడు)