
బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీలో కీలక బాధ్యతలు చేపట్టాడు. కార్తీక్‌ను బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా సోమవారం నియమించారు. ‘మా కీపర్‌కు స్వాగతం. కొత్త అవతార్‌లో కార్తీక్ మళ్లీ మా ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టాడు. ఈసారి మెన్స్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా పని చేయనున్నాడు. మనం క్రికెట్ నుంచి మనిషిని వేరు చేయొచ్చు. కానీ మనిషి నుంచి క్రికెట్‌ను తీసేయలేం’ అని ఫ్రాంచైజీ పేర్కొంది. కోచింగ్ కెరీర్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని కార్తీక్ వెల్లడించాడు. తన లైఫ్‌లో మొదలవుతున్న కొత్త అధ్యాయాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. ఆర్‌సీబీ విలువ పెంచేందుకు కృషి చేస్తానన్నాడు.