టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన క్రికెట్ కెరీర్ ను ముగించాడు. శనివారం (జూన్ 1) తన పుట్టిన రోజు నాడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. కొంతకాలంగా కార్తీక్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు వార్తలు వచ్చినట్టు తెలిసిందే. "కొంతకాలంగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. నా రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటించాను. కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను". అని కార్తీక్ సోషల్ మీడియాలో ప్రకటించాడు.
తమిళనాడుకు చెందిన దినేష్ కార్తీక్ భారత క్రికెట్ తరపున చివరిసారిగా జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్ ఆడాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో జింబాబ్వే పై తన చివరి మ్యాచ్ ఆడాడు. కార్తీక్ తన 19 సంవత్సరాల వయస్సులో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. 94 వన్డేల్లో 1,792 పరుగులు చేయగా.. వీటిలో 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి.టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో సహా 1,025 పరుగులు.. టీ20ల్లో 60 మ్యాచ్‌ల్లో 686 పరుగులు చేశాడు.
ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే22 బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్. 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
🚨 Dinesh Karthik has retired from all formats of the game pic.twitter.com/Ajk6HsACDu
— ESPNcricinfo (@ESPNcricinfo) June 1, 2024