DK: ఐపీఎల్‌కు రిటైర్మెంట్.. అబుదాబి లీగ్‌లో అరంగ్రేటం

భారత మాజీ వికెట్ కీపర్/ బ్యాటర్ దినేష్ కార్తీక్ కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ వికెట్ కీపర్.. అబుదాబి టీ10 లీగ్‌లో అరంగ్రేటం చేశాడు. రాబోయే ఎడిషన్‌లో డీకే బంగ్లా టైగర్స్ తరపున ఆడనున్నాడు. కార్తీక్‌తో పాటు రషీద్ ఖాన్, జోస్ బట్లర్ ఈ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

టైటిల్ రేసులో 10 జట్లు

మొత్తం పది జట్లు తలపడే ఈ టోర్నీ 2024, నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 2న ముగియనుంది. మ్యాచ్‌లన్నీ అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతాయి. ఐపీఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లందరూ ఈ టోర్నీలో కనిపించనున్నారు.

ALSO READ | IND Vs NZ: బెంగుళూరులో ఎడతెరిపిలేని వర్షం.. తొలి రోజు ఆట రద్దు

టోర్నీలో పాల్గొనే 10 జట్లు ఇవే..

  • న్యూయార్క్ స్ట్రైకర్స్
  • డెక్కన్ గ్లాడియేటర్స్
  • ఢిల్లీ బుల్స్
  • టీమ్ అబుదాబి
  • నార్తర్న్ వారియర్స్
  • మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ
  • బంగ్లా టైగర్స్
  • చెన్నై బ్రేవ్ జాగ్వార్స్
  • యూపీ నవాబ్స్ (కొత్త ఫ్రాంచైజీ)
  • బోల్ట్స్ అజ్మాన్