Dinesh Karthik: ఇప్పటికీ బుమ్రా తర్వాత అతడే భారత బెస్ట్ బౌలర్: దినేష్ కార్తీక్

ప్రస్తుతం టీమిండియాలో బెస్ట్ బౌలర్ ఎవరంటే ఠక్కున జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పేస్తాం. కేవలం భారత  క్రికెట్ లోనే కాదు ప్రపంచ  స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. బుమ్రా తర్వాత ఎవరు బెస్ట్ అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. కానీ భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రస్తుత రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరు చెప్పాడు.

"ఈ రోజుల్లో కూడా బుమ్రా తర్వాత భువనేశ్వర్ కుమార్ బెస్ట్ టీ20 బౌలర్ అని నేను నమ్ముతున్నాను". అని కార్తీక్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ సొంతం చేసుకున్న రాసిఖ్ సలామ్ పై కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. 24 ఏళ్ల యువకుడు రానున్న ఐపీఎల్ లో సత్తా చాటతాడని ధీమా వ్యక్తం చేశాడు. రాసిఖ్ సలామ్ ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్‌లో ఉన్నాడు.

ALSO READ | IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. గబ్బా టెస్టుకు వర్షం ముప్పు?

భువనేశ్వర్ కుమార్ ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2024 మెగా వేలంలో భువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. భువనేశ్వర్ కోసం ఎక్కడా రాజీపడలేదు బెంగళూరు. అతని కోసం ఎన్ని జట్లు పోటీకి వచ్చినా తగ్గేదే లేదన్నట్టు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్ సీజన్ లో భువీ సన్ రైజర్స్ తరపున ఆడాడు. 10 సంవత్సరాల తర్వాత అతను హైదరాబాద్ జట్టును వీడి బయటకు రావడం ఇదే తొలిసారి.