
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అదరగొట్టాడు. టోర్నీలో తొలిసారి అద్భుత ఇన్నింగ్స్ తో మెరిశాడు. గురువారం (జనవరి 30) జోబర్గ్ సూపర్ కింగ్స్ పై కీలకమైన హాఫ్ సెంచరీ చేసి తమ జట్టు పార్ల్ రాయల్స్ ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 39 బంతుల్లో కార్తీక్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా లీగ్ లో దినేష్ కార్తీక్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. రెండు మ్యాచ్ ల్లో దురదృష్టవశాత్తు రనౌట్ అయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
జోబర్గ్ సూపర్ కింగ్స్ కార్తీక్ ఒత్తిడి సమయంలో అద్భుతంగా రాణించాడు. 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తమ జట్టు కష్టాల్లో పడినప్పుడు ఒంటరి పోరాటం చేసి స్కోర్ బోర్డును 150 పరుగులకు చేర్చాడు. ముఖ్యంగా విహాన్ లుబ్బే వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కార్తీక్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం హైలెట్ గా నిలిచింది. మూడు సిక్సర్లు మిడ్ వికెట్ మీదుగా కొట్టడం విశేషం. ఆర్సీబీ జట్టులో బెస్ట్ ఫినిషర్ గా కితాబులు అందుకున్న కార్తీక్.. తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు.
Also Read :- మా జట్టులో అతడే అత్యంత విలువైన ఆటగాడు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా పార్ల్ రాయల్స్ ఓడిపోయింది. కీలకమైన మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ డుప్లెసిస్ 87 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
MAIDEN SA20 FIFTY FROM DINESH KARTHIK. 🙇♂️🌟pic.twitter.com/1c7uReQZ8l
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025