టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ వ్యక్తిగత జీవితం అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. అతని మొదటి భార్య నికితా వంజారా తనకు తెలియకుండా.. మరో భారత క్రికెటర్ మురళీ విజయ్‌తో చీకటి ప్రేమాయణం నడిపింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆమె చాలా జాగ్రత్త పడింది. అనంతరం ఈ విషయం నలుగురికి తెలిసి.. అవమానభారంతో కార్తీక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
ఆపై కొన్నాళ్ళకు మొదటి భార్య నికితా వంజారాకు విడాకులు ఇచ్చిన కార్తీక్.. 2015, ఆగస్టు 18న భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ను పెళ్లాడాడు. ఈ దంపుతులకు 2021లో కవల పిల్లలు జన్మించారు. గడిచిన శుక్రవారంతో వీరి పెళ్ళై 8 సంవత్సరాలు గడిచాయి. ఈ సంధర్బంగా కార్తీక్.. భార్య దీపికాను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో గాఢమైన ప్రేమ సందేశాన్ని పంచుకున్నారు.
"ఎన్ని సంవత్సరాలు గడిచినా.. ఎన్ని సమస్యలు ఎదురైనా నిజమైన ప్రేమ ఎప్పటికీ మనుగడ సాగిస్తుంది.. హ్యాపీ డీకే-డీపీ డే" అని కార్తీక్ తన ట్విట్టర్, ఇన్ స్టా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్.. ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పేలవ ఫామ్ కారణంగా దినేశ్ కార్తీక్ జట్టులో స్థానం కోల్పోయారు. గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ ఓటమి తరువాత అతను జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటివరకూ భారత జట్టు తరపున అతను.. 26 టెస్టులు, 94 వన్డేలు, 56 టీ20లు ఆడారు.