మన గడ్డపై మనకు వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ సలహాదారుడిగా దినేష్ కార్తీక్

మన గడ్డపై మనకు వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ సలహాదారుడిగా దినేష్ కార్తీక్

భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ లయన్స్‌ కు సలహాదారుడిగా వ్యవహరించనున్నాడు. తొమ్మిది రోజులపాటు ఈ టూర్ ఉంటుంది. ప్రస్తుతం కార్తీక్ బిగ్ బాష్ లీగ్ లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జట్టుతో ఉన్నాడు. రేపు (జనవరి 12) భారత్ కు వచ్చి ఇంగ్లాండ్ లయన్స్ కు బ్యాటింగ్ కన్సల్టెంట్ ఉన్న ఇయాన్ బెల్ తో కలిసి పని చేస్తాడు. 
 
ప్రధాన కోచ్ నీల్ కిలీన్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు రిచర్డ్ డాసన్, కార్ల్ హాప్‌కిన్‌సన్‌లతో కలిసి ఇంగ్లాండ్ లయన్స్ కు విలువైన సలహాలు ఇవ్వనున్నాడు. మాజీ ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఈ కోచింగ్ టీంకు మెంటార్‌గా ఉంటాడు. జనవరి 12న అహ్మదాబాద్‌లో వార్మప్ గేమ్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ఇదే వేదికపై జనవరి 17 నుంచి 20 వరకు మొదటి టెస్ట్, 24 న రెండో టెస్ట్, ఫిబ్రవరి 1 న మూడో టెస్ట్ జరుగుతాయి. ఇవన్నీ అనధికార టెస్ట్ మ్యాచ్ లే కావడం గమనార్హం. నాలుగు రోజుల పాటు జరిగే మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఫిబ్రవరి 4 న ముగుస్తుంది. 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న దినేష్ కార్తీక్ ప్రస్తుతం కామెంటేటర్ గా పని చేస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ కు  భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ సీనియర్ బ్యాటర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. 

భారత పర్యటనకు ఇంగ్లండ్ లయన్స్ జట్టు:

జోష్ బోహన్నన్ (కెప్టెన్), కాసే ఆల్డ్రిడ్జ్, బ్రైడన్ కార్సే, జాక్ కార్సన్, జేమ్స్ కోల్స్, మాట్ ఫిషర్, కీటన్ జెన్నింగ్స్, టామ్ లావ్స్, అలెక్స్ లీస్, డాన్ మౌస్లీ, కల్లమ్ పార్కిన్సన్, మాట్ పాట్స్, ఒల్లీ ప్రైస్, జేమ్స్ రెవ్ మరియు ఆలీ రాబిన్సన్.