పుజారా, రహానే లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. వీరు కంబ్యాక్ ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. తాజాగా సెలక్టర్లు వీరిని దులీప్ ట్రోఫీకి సెలక్ట్ చేయకపోవడంతో వీరి భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారింది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించి ద్రావిడ్, లక్ష్మణ్ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారు.
మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడితే.. ఐదో స్థానంలో రహానే నిలకడగా రాణించాడు. బాగా టెస్టుల్లో వీరి స్థానం సుస్థిరం చేసుకున్నారు. పుజారా, రహానే స్థానాలను భర్తీ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. అయితే వీరిద్దరి స్థానాలను ప్రస్తుతం టీమిండియాలో శుభమాన్ గిల్, సర్ఫరాజ్ మాత్రమే భర్తీ చేయగలరని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తెలిపాడు.
Also Read:-సౌతాఫ్రికా టీ20 లీగ్ షెడ్యూల్ రిలీజ్
“గిల్, సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై బాగా రాణించారు. వారిద్దరూ ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖచ్చితంగా ఉంటారు. వీరిద్దరూ పుజారా, రహానే స్థానాలను భర్తీ చేయగలరని భావిస్తున్నా". అని కార్తీక్ అన్నాడు. గిల్ ఆస్ట్రేలియాలో జరిగిన 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనే టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం.
2023 దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ వెటరన్ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.
రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.
🗣️ Dinesh Karthik believes Shubman Gill and Sarfaraz Khan can replace Cheteshwar Pujara and Ajinkya Rahane in India's squad for the upcoming Border-Gavaskar Trophy.
— OneCricket (@OneCricketApp) September 2, 2024
via Cricbuzz #ShubmanGill | #SarfarazKhan pic.twitter.com/pJkGgUjtiA