Dinesh Karthik: దినేష్ కార్తీక్ అల్‌టైం భారత జట్టు ఇదే.. ధోనీ, గంగూలీకి నో ఛాన్స్

Dinesh Karthik: దినేష్ కార్తీక్ అల్‌టైం భారత జట్టు ఇదే.. ధోనీ, గంగూలీకి నో ఛాన్స్

టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన ఆల్ టైం భారత జట్టును ప్రకటించాడు. తన ప్లేయింగ్ 11 లో ఐదుగురు బ్యాటర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ఇద్దరు స్పిన్నర్లు..  ఇద్దరు పేసర్‌లను ఎంచుకున్నాడు. ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా  రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లను సెలక్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఆడతాడు.         

ఆల్ రౌండర్లుగా యువరాజ్ సింగ్.. రవీంద్ర జడేజా వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. కార్తీక్ తన జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు చోటిచ్చాడు. రవి చంద్రన్ అశ్విన్ తో పాటు లెజెండరీ స్పిన్నర్ అనీల్ కుంబ్లేలకు స్థానం దక్కింది. కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఈ జట్టులో ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జహీర్ ఖాన్ తో పాటు.. జస్ప్రీత్ బుమ్రా కార్తీక్ జట్టులో అవకాశం దక్కించుకున్నారు. 

12 ప్లేయర్ గా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను తీసుకున్నాడు. ఈ జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్ ఎవరనే విషయం చెప్పలేదు. భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలకు కార్తీక్ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే ఐపీఎల్ తో పాటు దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తొలిసారి ఆడనున్నాడు.  

దినేష్ కార్తీక్ ప్లేయింగ్ XI :

వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్..  హర్భజన్ సింగ్(12 ఆటగాడు)