SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్‌లోనే దినేష్ కార్తీక్ బ్యాడ్ లక్

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లోనే టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కు దురదృష్టం వెంటాడింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ కోసం పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్న కార్తీక్ తొలి మ్యాచ్ లో రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఈ టీమిండియా మాజీ బ్యాటర్..లిండే బౌలింగ్ లో బంతిని పాయింట్ దిశగా కట్ చేసి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోలిన్ ఇంగ్రామ్ పాయింట్ నుంచి వేగంగా బంతిని వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ వైపు విసిరాడు. 

అప్పటికీ క్రీజ్ సగం వరకు వెళ్లిన కార్తీక్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికీ రనౌట్ అయ్యాడు. దీంతో తన తొలి మ్యాచ్ లో కేవలం 7 బంతుల్లో 2 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఆడే తొలి భారత ప్లేయర్ గా దినేష్ కార్తీక్ నిలవడనుండడంతో అందరి దృష్టి ఈ వెటరన్ ప్లేయర్ పైనే నిలిచింది. సన్ రైజర్స్ పై అంతకముందు తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే పార్ల్ రాయల్స్ పై 33 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఘన విజయం సాధించింది.    

ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు  రిటైర్మెంట్ ప్రకటించారు. మే22, 2024 బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూ బిజీగా మారిపోయాడు.  

దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్‌ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్. 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.