మల్లన్నను దర్శించుకున్న మాజీ డీజీపీ

మల్లన్నను దర్శించుకున్న మాజీ డీజీపీ

కొమురవెల్లి, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేశ్​రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువ కప్పి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసి ఘనంగా సన్మానం చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లికార్జునస్వామి తనకు ఇష్ట దైవమని, గతంలో తాను రెండుసార్లు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు మల్లికార్జున్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్​ఐ నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.