ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో బుండిబుగ్యా నగరంలో 300 మంది డింగా డింగా అనే వైరస్ బారిన పడ్డారు. డ్యాన్స్ చేస్తున్న మాదిరి రోగి శరీరం తీవ్రస్థాయిలో వణకటంతో ఈ వ్యాధికి డింగా డింగా అనే పేరు పెట్టారు. ఉగాండాలోని స్థానిక భాషలో డింగా డింగా అంటే షేకింగ్ అని అర్థం.
డాన్సింగ్ ప్లేగ్: 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ ప్రాంతంలో విజృంభించిన డాన్సింగ్ ప్లేగ్అనే వ్యాధి కారణంగా ఎంతో మంది మరణించారు. ఇప్పుడు ఉగాండాలో విజృంభిస్తున్న ఈ డింగా డింగా వైరస్ లక్షణాలు డాన్సింగ్ ప్లేగ్ లక్షణాలను పోలినట్టే ఉన్నాయని భావిస్తున్నారు. ఈ డింగా డింగా వైరస్ ఎక్కువగా మహిళలకు, బాలికలకు సోకుతుంది. మరోవైపు ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో అంతుచిక్కని మరో రకమైన వ్యాధి ప్రబలుతున్నది. అది ఇప్పటికే 400 మందికి సోకిందని, ఒకేచోట 394 కేసులు నమోదు కాగా, 30 మంది మృతిచెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
డింగా డింగా వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన వాళ్లలో తీవ్రమైన జ్వరం, శరీరం తీవ్రంగా వణకటం, విపరీతమైన బలహీనత తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంత మందిలో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోగా పక్షవాతం బారిన పడుతున్నారు.