- 256 భారీ సైజు ఎగ్స్ స్వాధీనం
- ఇప్పటిదాకా ఎక్కడా ఇన్ని దొరకలేదంటున్న సైంటిస్టులు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో అతిపెద్ద డైనోసార్లు జీవించినట్టు ఇండియన్ సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తం 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజు టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కూడా కనుగొన్నారు. ఇప్పటి దాకా ఇంత భారీ స్థాయిలో ఎగ్స్ ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని సైంటిస్టులు అంటున్నారు. వీటిలో చాలా అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్టు తెలిపారు. నర్మదా వ్యాలీలో డైనోసార్ జాతులు, అక్కడి వాతావరణంపై సమాచారం సేకరించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడ్తాయని అంటున్నారు. ధార్ జిల్లాలోని బాగ్ – కుక్షి ప్రాంతాల్లో సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. అఖాడా, ధోలియా రాయ్ పురియా, ఝబా, జమ్నియాపూరా, పడ్లియా గ్రామాల్లో ఎక్కువ గుడ్లు బయటపడ్డాయని జర్నల్ ప్లోస్ వన్‌లో దీనికి సంబంధించిన న్యూస్పబ్లిష్ అయ్యింది. ఈ ప్రాంతం సెంట్రల్ ఇండియా అప్పర్ నర్మదా లోయలోని జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), వెస్ట్రన్ సెంట్రల్ ఇండియాలోని లోయర్ నర్మదా లోయ, పశ్చిమాన ఉన్న బాలాసినోర్ (గుజరాత్) మధ్య ఉంది. 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం.. 250 కంటే ఎక్కువ టైటానోసార్ ఎగ్స్‌తో పాటు హేచరీస్‌ను కనుగొన్నదని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది.
1928లో ఫస్ట్ టైం గుర్తింపు
టైటానోసార్ సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్‌లు ఇప్పటివరకు భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. ఇవి పొడవైన మెడ, తోక, చిన్న తల, స్తంభాల్లాంటి నాలుగు కాళ్లు కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఫస్ట్ డైనోసార్ అవశేషాలను 1928లో జబల్‌పూర్ దగ్గర్లో కెప్టెన్ స్లీమన్ గుర్తించారు. అప్పటి నుంచి ఈ ఏరియాలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, రాహియోలిసారస్ గుజరాటెన్సిస్, ఇండోసుచస్ రాప్టోరియస్, ఇండోసారస్ మాట్లేయి, లేవిసుచస్ ఇండికస్, జైనోసారస్ సీఎఫ్ వంటి డైనోసార్ జాతులున్నాయి. సెప్టెంట్రియోనాలిస్, ఇసిసారస్ కోల్బెర్టి, టైటానోసౌరిఫార్మ్స్ ఇండెట్, టైటానోసార్లలో తొమ్మిది ఓస్పెసీలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇండియన్ సబ్ కాంటినెంటల్‌లో నివసించిన టైటానోసార్ ఎగ్స్ వేరే ప్రాంతాలతో పోలిస్తే డిఫెరెంట్‌గా ఉన్నట్టు గుర్తించారు. పక్షుల మాదిరి గుడ్డు పెట్టే లక్షణానికి అనుగుణంగా ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. తాబేళ్లు, బల్లుల మాదిరిగానే డైనోసార్లకు పునరుత్పత్తి వ్యవస్థ ఉందా అనే దానిపై పరిశోధనలు చేయడానికి ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొన్ని మిలియన్ ఏండ్ల కింద ఇవి ఇండియన్ భూభాగంలో సంచరిస్తుండేవి. ఈ డైనోసార్ల శిలాజాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలో కూడా బయటపడ్డాయి.