ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ

ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
  • ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి
  •     పీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్​లో దీపాదాస్ మున్షీ

హైదరాబాద్, వెలుగు :  త్వరలో జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుపొందాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ సూచించారు. పీసీసీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన గురువారం గాంధీ భవన్​లో జరిగిన మీటింగ్​కు దీపాదాస్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఈ కమిటీ సరైన పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలని కోరారు.

 కమిటీ చైర్మన్ గాంధీ భవన్ కేంద్రంగా ఉన్న వార్ రూం నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల తీరుపై మానిటరింగ్ చేయాలని, ఇందులోని కమిటీ సభ్యులు ఎన్నికలు జరగనున్న మూడు జిల్లాలకు వెళ్లి పోల్ మేనేజ్మెంట్ పై పార్టీ నేతలకు, కార్యకర్తలకు వివరించాలని సూచించారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వరకు ఇదే కమిటీని కంటిన్యూ చేస్తున్నామని ఆమె ప్రకటించారు. కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ పరంగా తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో జరిగిన పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఫైనల్ నివేదికను వారంలోపు సీఎం రేవంత్ కు, దీపాదాస్ మున్షీకి అందజేస్తామని కమిటీ నిర్ణయించింది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్సీలు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.