జీవితంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేయలేకపోతే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే కొందరు తమ శక్తికి మించిన పనులను వయసు మళ్లిన తర్వాత అయినా పూర్తి చేసేందుకు సిద్ధపడతారు. ఈ బామ్మ కూడా అంతే.. సెంచరీ కొట్టబోయే వయసులో తన ఆశయాన్ని నెరవేర్చుకుంది.
ఉతాహ్కి చెందిన క్యాథరిన్ కోల్ వయసు ఇప్పుడు 97 ఏండ్లు. ఈ వయసులో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో డిప్లొమా అందుకుంది. సెంచరీ కొట్టడానికి ఇంకా మూడేండ్లు ఉన్న టైంలో చదువుకున్న ఈ బామ్మను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది! నిజానికి క్యాథరిన్‌కు చిన్నప్పట్నించీ చదువుకోవడమంటే చాలా ఇష్టం. అలానే ఆమె హాయిగా చదువుకుంటోంది కూడా. కానీ సడెన్‌గా ఆమె తాత చనిపోయాడు. ఆయన అంత్యక్రియలు చేసిన రోజు ఆమె ఇంగ్లిష్ క్రెడిట్ అనే కోర్స్ పూర్తయ్యేందుకు రాయాల్సిన ఫైనల్ టెస్ట్ రోజు ఒకటే అయ్యింది.
దాంతో ఆమె చదువుకు బ్రేక్ పడింది. తాత చావుతో ఆ కుటుంబానికి సపోర్ట్‌గా ఉండాల్సి వచ్చింది క్యాథరిన్‌కు. దాంతో చదువుకోవాలనే ఆశను చంపుకుని 1940 నుంచి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంది. అలా ఏండ్లు గడిచిపోయాయి. కానీ ఎప్పటికైనా సరే చదువుకోవాల్సిందే అనుకుంది. అందుకని గత కొన్నేండ్లుగా టాబియోనా పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్‌తో కలిసి రీడింగ్ స్కిల్స్ పెంచుకుంది.
దానికి సంబంధించి ఎగ్జామ్ పెడితే అందులో ఆమె క్వాలిఫై అయింది. అలా ఆమె 97 ఏండ్ల వయసులో డిప్లొమా అందుకుంది. అప్పుడు ఉద్వేగానికి గురైన ఆమె ‘‘నా జీవితం మొత్తం నేను కోరుకున్నది ఇదే. ఈ జీవితంలో ఇది సాధించలేనేమో అనుకున్నా. కానీ, ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పని లేదు” అంది కోల్.