సీఐటీడీలో డిప్లొమా కోర్సులు

సీఐటీడీలో డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ బాలానగర్‌‌‌‌లోని ఎంఎస్‌‌‌‌ఎంఈ టూల్‌‌‌‌ రూం- సెంట్రల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2024-–25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

కోర్సులు: డిప్లొమా ఇన్ టూల్, డై అండ్‌‌‌‌ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌‌‌‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌‌‌‌ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌‌‌‌ఈ): 60, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
 

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తులు: ఆఫ్‌‌‌‌లైన్ /ఆన్‌‌‌‌లైన్ మోడ్ ద్వారా మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మే 26న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.citdindia.org వెబ్​సైట్​లో సంప్రదించాలి.