జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు

జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు, అనుబంధ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కింది డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. 

సీట్లు, కోర్సులు:  డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లీష్ మీడియం): 630 సీట్లు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లీష్ మీడియం): 60, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లీష్​ మీడియం): 110 సీట్లు ఉన్నాయి. 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2024లో అర్హత సాధించి ఉండాలి. వయసు 2024 డిసెంబర్​ 31 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2024లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకులు, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తులు: ఆన్​లైన్​లో జూన్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1200 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.diploma.pjtsau.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.