టెన్త్ అనంతరం జాబ్ కొట్టాలన్నా.. డిప్లొమాలో చేరాలన్నా ఏకైక మార్గం పాలిటెక్నిక్. డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్నాక.. ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య కోసం బీటెక్‌లో చేరే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ఎంట్రెన్స్‌కు మార్గం.. పాలిసెట్. టీఎస్ పాలిసెట్-2024లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో పాలిసెట్ వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం..
పాలిటెక్నిక్ కా లేజీలు అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్)ను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 118 పాలిటెక్నిక్ కళాశాలల్లో 32 బ్రాంచ్‌లలో మొత్తం 29,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని 11 అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్‌లో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో 280 సీట్లు, రెండేళ్ల వ్యవధిలోని అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల్లో 450 సీట్లు; అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా (ఇంగ్లీష్ మీడియం)లో 90 సీట్లు ఉన్నాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్: టీఎస్ పాలిసెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథ్స్ 60 ప్రశ్నలు -60 మార్కులు; ఫిజిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు; కెమిస్ట్రీ 30 ప్రశ్నలు-30 మార్కులు; బయాలజీ 30 ప్రశ్నలు-30 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రెండున్నర గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
ఉమ్మడి కౌన్సెలింగ్: పాలిసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి.. అభ్యర్థులు పొందిన మార్కులు, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకొని అడ్మిషన్స్ కల్పిస్తారు. సీట్ అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు సంబంధిత పాలిటెక్నిక్ కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
ఉపాధితో పాటు ఉన్నత విద్య: పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరు పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఏఈఈ పోస్ట్‌లకు, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏఈఈ పోస్ట్‌లకు పోటీ పడొచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈ-సెట్)లో ర్యాంకు ఆధారంగా లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం ఉంది.
స్కాలర్‌షిప్‌తో సాయం: పాలిసెట్ ర్యాంకుతో డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఏఐసీటీఈ -ప్రగతి స్కాలర్‌షిప్ పేరుతో.. దేశవ్యాప్తంగా అయిదు వేల మంది మహిళా విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున స్కాలర్‌షిప్ మొత్తాన్ని అందిస్తారు. సాక్షమ్ స్కాలర్‌షిప్ పేరుతో దివ్యాంగ విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేల మొత్తాన్ని స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.
సిలబస్‌పై పట్టుండాలి
బయాలజీ: ఇందులో మంచి స్కోర్ కోసం ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత.. దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చేసి.. భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. పదో తరగతి చాప్టర్స్‌లోని ప్రాక్టికల్స్ పై అవగాహన పొందడం మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, బేధాలు తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
మ్యాథ్స్: ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. టెన్త్ మ్యాథ్స్ బుక్‌లోని ప్రతి చాప్టర్‌ను చదివి ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; క్షేత్రమితి;త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించాలి. పాఠ్యపుస్తకంలోని ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి.
ఫిజిక్స్: ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి.. ప్రయోగాలు- క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు -ప్రాజెక్ట్ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలను శ్రద్ధతో చదవాలి. అదే విధంగా.. మూలకాల ధర్మాలు- వర్గీకరణ, రసాయన సమీకరణాలను ప్రాక్టీస్ చేయాలి.
కెమిస్ట్రీ: ఆమ్లాలు, క్షారాలు; లవణాలు, పరమాణు నిర్మాణం, పి-బ్లాక్ ఎలిమెంట్స్, పిరియాడిక్ టేబుల్, మూలకాల వర్గీకరణ, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగెటివిటీ, మెటాలిక్, నాన్-మెటాలిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ కాంపౌండ్స్ తదితర ముఖ్యమైన యూనిట్లలోని అన్ని అంశాలపై ఫోకస్ చేయాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ముందు ఆవర్తన టేబుల్ నేర్చుకోవాలి, ఎందుకంటే వారికి కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడం సులభం అవుతుంది. అభ్యర్థులు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి కెమికల్ బాండింగ్, కార్బన్ కెమిస్ట్రీ, కెమికల్ లోహాలకు సంబంధించిన అధ్యాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అభ్యర్థులు ఈక్వేషన్స్, కాన్సెప్ట్‌లు, ఆవర్తన టేబుల్, ఇతర అధ్యాయాలను రెగ్యులర్ బేసిక్‌లో సవరించడానికి సమయాన్ని కేటాయించాలి.
‑ వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్
నోటిఫికేషన్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. 2024లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్ పరీక్ష మే 24న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
రిఫ్రెష్అవ్వాలి: అభ్యర్థులు తప్పనిసరిగా వారి సొంత టీఎస్ పాలిసెట్ స్టడీ ప్రణాళికని రూపొందించుకోవాలి. టైమ్‌టేబుల్‌లో దరఖాస్తుదారులు ప్రతిరోజూ ఎన్ని, ఏయే సబ్జెక్టులు, యూనిట్‌లను చదువుతారనే రోజువారీగా విభజించుకోవాలి. దరఖాస్తుదారుల అధ్యయనాలు మార్పు లేని విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. అభ్యర్థులు కంటిన్యూగా చదవకుండా రిఫ్రెష్ చేసుకునేందుకు మధ్యలో తరచుగా విశ్రాంతిని తీసుకోవాలి.
డిప్లొమా కోర్సులు
పాలిటెక్నిక్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సుల్లో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; ఎలక్ట్రికల్ వెహికిల్ టెక్నాలజీ; ఈసీఈ; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్); ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్; అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్; కంప్యూటర్ ఇంజనీరింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్; 3-డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్); క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా; కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్; మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్; అపరెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ; మెటలర్జికల్ ఇంజనీరింగ్; టెక్స్‌టైల్ ఇంజనీరింగ్; బయో మెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ); కెమికల్ ఇంజనీరింగ్ (పెట్రో కెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్ (ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్); కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ); సెరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ; ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ అండ్ గూడ్స్ టెక్నాలజీ; ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్; సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా; ప్రింటింగ్ టెక్నాలజీ; హోమ్ సైన్స్; మైనింగ్ ఇంజనీరింగ్.