మున్సిపల్​ చైర్మన్​ పదవులకు డైరెక్ట్​ ఎన్నికలు నిర్వహించాలి : మున్సిపల్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

మున్సిపల్​ చైర్మన్​ పదవులకు డైరెక్ట్​ ఎన్నికలు నిర్వహించాలి : మున్సిపల్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మున్సిపల్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు. సోమవారం హైదర్ గూడలోని మున్సిపల్ చాంబర్స్ ఆఫీసులో కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73, 74వ రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తూట్లు పోడిచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక, పంచాయతీ రాజ్ నూతన చట్టాలను తీసుకొచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. టీడీఎస్​నిధులను రాష్ట్ర ఖజానా ద్వారా కాకుండా మున్సిపల్ సాధారణ నిధుల కింద ఖర్చు చేసే వేసులుబాటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.