హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌లైన్ కంపెనీ లుఫ్తాన్సా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీకి) నాన్‌స్టాప్ డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు లుఫ్తాన్సా తొలి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చే ఏడాది జనవరి 16 న ప్రారంభమవుతుంది. వైడ్ బాడీ బోయింగ్ బీ787-9 డ్రీమ్‌లైనర్ విమానంతో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ విమానం వారానికి మూడుసార్లు- ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.
లెక్సస్ ఎల్‌సీ 500 హెచ్ ధర రూ. 2.39 కోట్లు
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ గురువారం ఇండియన్ మార్కెట్‌లోకి ఎల్‌సీ 500 హెచ్ లగ్జరీ కౌప్‌ను తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.2.39 కోట్లు (ఎక్స్‌షోరూమ్). ఈ ఎల్‌సీ కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అవుతుందని, కొత్త టెక్నాలజీ, డిజైన్ అప్‌గ్రేడేషన్‌తో ఈ కారుని తెచ్చామని లెక్సస్ పేర్కొంది.
బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్‌లో కొత్త వెర్షన్
జెడ్ 4 రోడ్‌స్టర్‌లో కొత్త వెర్షన్‌ను బీఎండబ్ల్యూ లాంచ్ చేసింది. ధర రూ. 89.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంప్లీట్లీ బిల్టప్ యూనిట్ (సీబీయూ–విదేశాల్లో తయారవుతుంది) గా ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ వెర్షన్ అయిన ఈ బండిలో ఆరు సిలిండర్ల ఇంజిన్‌ను అమర్చారు.
గంటకు 100 కి.మీ స్పీడ్‌ను 4.5 సెకెన్లలోనే అందుకుంటుంది.