హైదరాబాద్​లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్

హైదరాబాద్, వెలుగు: అసోసియేషన్ డైరెక్ట్ ఆఫ్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్​ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఎఫ్​ఐడీఎస్​ఐ) సహకారంతో హైదరాబాద్​లో తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించింది.  

కార్యక్రమానికి చీఫ్​ గెస్టుగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వచ్చారు. నైతిక శిక్షణను ప్రోత్సహించడం, పారదర్శకతను పెంపొందించడం,  భద్రతను పెంచడం ద్వారా సెల్లింగ్​ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. 

 డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఉద్యోగాలను సృష్టిస్తుందని,  తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే సామర్థ్యం ఉందని జయేశ్​ అన్నారు.  అన్ని డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని అన్నారు.  ఉత్పత్తి లేదా సేవను నేరుగా మధ్యవర్తులు లేకుండా కస్టమర్లకు అందించడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు.