కొత్త టెక్నాలజీ : సిమ్ కార్డు లేకుండా ఫేవరేట్ ఛానెల్స్, షోలు చూసేయొచ్చు..

కొత్త టెక్నాలజీ : సిమ్ కార్డు లేకుండా ఫేవరేట్ ఛానెల్స్, షోలు చూసేయొచ్చు..

సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ అవసరం లేకుండా వీడియో (ఫేవరేట్ ఛానల్స్, షోలు) చూసేందుకు కొత్త టెక్నాలజీ వస్తోంది. వినియోగదారులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు చేసేందుకు వీలుగా డైరెక్ట్ టు మొబైల్ (D2M) సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. IIT కాన్పూర్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కలిసి ఈ సంచలనాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. 

D2M  ఎలా పనిచేస్తుంది 

ఇంటర్నెట్ లేకుండా FM రేడియో ద్వారా పాటలు వినడం మాదిరిగానే ఈ టెక్నాలజీ  కూడా మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్, డేటా అవసరం లేకుండా తమకు ఇష్టమైన టీవీ ఛానెల్ లు, షోలను చూసేందుకు అనుమతిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న టెరెస్ట్రియల్ బ్రాడ్ కాస్టంగ్ కమ్యూనికేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించడం ద్వారా పనిచేస్తుంది. 

దేశంలో మొత్తం 19 నగరాల్లో ఈ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ కోసం ట్రయల్స్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ టెక్నాలజీతో మొబైల్ నెట్ వర్క్ లపై భారాన్ని తగ్గించడం, వీడియో బఫరింగ్ ను తగ్గించడం, ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం లక్ష్యంగా పనిచేస్తుంది. 

ఈ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ ద్వారా 5G నెట్ వర్క్ లలో వీడియో ట్రాఫిక్ ను 25 నుంచి 30 శాతం వరకు తగ్గించవచ్చని ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీ అపూర్వ చంద్ర చెపుతున్నారు. ఇది స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి తోడ్పడుతుందని చెప్పింది. దేశంలో డిజిటల్ ఎవల్యూషన్ , కంటెంట్ డెలివరీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు అపూర్వ చంద్ర.