కన్నడ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన దర్శకుడు ఎ.హర్ష.. గోపీచంద్ సినిమా ‘భీమా’తో తెలుగులోకి వస్తున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.హర్ష మాట్లాడుతూ ‘రాధా మోహన్ గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలోని రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఆ సంస్థ నిర్మించిన ‘భీమా’తో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. గోపీచంద్ గారికి ఈ కథను స్క్రీన్ ప్లేతో సహా నెరేట్ చేశాను. ఇందులోని ఎమోషన్స్‌తో పాటు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కథను నడిపించడం ఆయనకు చాలా నచ్చింది. ఆయన పోషించిన భీమా క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
ఆ పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. కమర్షియల్ యాక్షన్ మూవీలో ఫాంటసీని జోడించడంతో కొత్తగా వచ్చింది. ప్రేక్షకులకు అది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ప్రియా భవానీ చాలా చక్కని పాత్రని పోషించింది. మాళవిక శర్మ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. రాధా మోహన్ గారు ఎంతో ప్యాషన్ వున్న నిర్మాత. అద్భుతమైన క్వాలిటీతో నిర్మించారు. మా సినిమాలో ఆరంభం, ముగింపు శివునితో ఉంటుంది. హీరో ఫస్ట్ డైలాగ్ శివుడిపైనే. అలాగే ఎంట్రీ సీన్‌లో ఎద్దుపై వస్తారు. అలా ప్రతిదీ శివుడితో లింక్ అయి ఉంది. మేము ప్లాన్ చేసుకోకుండా శివరాత్రికి మా సినిమా రావడం ఆ శివుని ఆజ్ఞగా భావిస్తున్నాం. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందనే నమ్మకముంది’ అని చెప్పారు.