Aditya Haasan: 90స్ వెబ్ సిరీస్ డైరెక్టర్తో ఆనంద్ దేవరకొండ మూవీ.. జోనర్ ఏంటంటే?

90’s మిడిల్ క్లాస్ బయోపిక్( #90's A Middle Class Biopic) వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు ఆదిత్య హాసన్ (Adithya Haasan) తెరకెక్కించిన ఈ సిరీస్తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా పేరు సంపాదించాడు. దీంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. మొన్నటికి మొన్న దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రొడ్యూస్ చేసిన ప్రేమలు మూవీకి డైలాగ్ రైటర్గా ఆదిత్య హాసన్ను తీసుకుని బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తన రెండో మూవీని టాలీవుడ్ బడా బ్యానర్లో చేస్తూ లక్కీ ఛాన్స్ కొట్టేసాడు.

ఇవాళ జనవరి 15న దర్శకుడు ఆదిత్య హాసన్ రెండో మూవీ అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార బ్యానర్లో ఆదిత్య హాసన్ సెకండ్ మూవీ చేస్తున్నట్లు కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుంది.

"ఇది నా స్టోరీ? మీ స్టోరీ? మన స్టోరీ.. మీరు తక్షణమే ప్రేమించే పాత్రతో మిడిల్ క్లాస్ లవ్ స్టోరీని మీకు అందిస్తున్నాము" అంటూ కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తి పెంచుతుంది.

ALSO READ | Sankranthiki Vasthunam: అఫీషియల్.. సంక్రాంతికి వ‌స్తున్నాం కలెక్షన్స్ అనౌన్స్.. వెంకీ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్

ఈ లవ్ స్టోరీ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుందని.. ఎలా అయితే 90 బయోపిక్ చాలామందికి కనెక్ట్ అయిందో.. ఈ సినిమా కూడా కనెక్ట్ అయ్యేలాగా ఆదిత్య హాసన్ రాసుకున్నాడని టాక్. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకుని అక్కడ సెటిల్ అయ్యే యువతను ఆధారంగా చేసుకుని ఆదిత్య హాసన్  ఈ సినిమా రాసుకున్నారని సినీ వర్గాల సమాచారం.

ఇకపోతే 90’sవెబ్ సీరీస్,ప్రేమలు ఈ రెండు సినిమాల్లో ఆదిత్యా హాసన్ నుంచి వచ్చిన సీన్స్, కామెడీ పంచ్ లు ఆడియన్స్ కి భలే ఇంపాక్ట్ ఇచ్చాయి. ఆదిత్య హాసన్ కామెడీ ఇచ్చే బలం..ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేకర్స్ అంటున్నారు.