సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)ప్రత్యేక పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజయి..ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అయితే, సినిమా రిలీజై చాలా నెలలు కావొస్తున్నా..ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అంటూ మేకర్స్ ఊరిస్తూ రావడంతో తలైవా ఫ్యాన్స్ కాస్త అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 16న జరిగిన ఓ ఈవెంట్లో ఓటీటీ రిలీజ్ డేట్పై డైరెక్టర్ ఐశ్వర్య కీలక అప్డేట్ ఇచ్చారు.
అదేంటంటే..ఈ సినిమా డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం.. 'రజనీకాంత్‌పై దాదాపు 21రోజుల పాటు తీసిన ఓ యాక్షన్ ఎపిపోడ్‌తో పాటు కొన్ని కీలకమైన సీన్స్ తాలూకు హార్డ్ డిస్క్ మిస్సయిందంటూ, ఆ సీన్స్ ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదంటూ రిలీజ్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఆ హార్డ్‌డిస్క్ దొరికిందని తాజాగా వెల్లడించారు ఐశ్వర్య. పోయిన హార్డ్‌డిస్క్‌లో ఉన్న ముఖ్యమైన సీన్లతో కలిపి త్వరలో లాల్ సలామ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని చెప్పారు.
ALSO READ | ఐశ్వర్య రజినీకాంత్ మానవత్వం : డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏటా రూ.10 లక్షల విరాళం
ఇప్పుడు యాడ్ చేయబోయే సీన్లకు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేలా సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‍తోనే చర్చించినట్టు వెల్లడించారు.దీంతో త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ రానుందని తెలిపడంతో తలైవా ఫ్యాన్స్ రిలాక్స్ తో పాటు ఎగ్జాయిట్ అవుతున్నారు. ఇక పోయిన హార్డ్‌డిస్క్ దొరకడంతో..థియేటర్స్ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ అదిరిపోతుంది అని ఐశ్వర్య వెల్లడించడం విశేషం.
అయితే, లాల్ సలామ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ కూడా దక్కించుకుంది. దీంతో రెండు ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. ఓటీటీ వెర్షన్ రెడీ అయ్యాక స్ట్రీమింగ్ డేట్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మూవీ సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‍తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించగా..కేవలం రూ.20కోట్లలోపే కలెక్షన్లు దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకుంది. మరీ ఈ కొత్త వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో తెలియాల్సి ఉంది