కుటుంబమంతా కలిసి చూసేలా.. మాధవే మధుసూదన

తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘మాధవే మధుసూదన’.  నవంబర్ 24న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శక నిర్మాత రామచంద్ర రావు మాట్లాడుతూ ‘నాగార్జున గారి దగ్గర మేకప్‌‌‌‌మెన్‌‌‌‌గా పనిచేస్తూ..  స్టార్ డైరెక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారనేది గమనించేవాడిని. 

ఈ సినిమా కోసం చాలా మంది హీరోలను అడిగాను. కానీ మేకప్‌‌‌‌మెన్ నుంచి దర్శక నిర్మాతగా మారుతున్నా అంటే  నమ్మలేదు. రిస్క్ ఎందుకు అని నా కొడుకుతోనే తీయాలనుకున్నా. ఓ ఏడాది ట్రైనింగ్ ఇప్పించి హీరోగా తీసుకున్నా. ఎక్కడా కొత్త కుర్రాడు నటించినట్టుగా అనిపించదు. స్క్రీన్ మీద ఏం చూపించాలనేది దర్శకుడికి తెలుస్తుంది. అదే టైమ్‌‌‌‌లో బడ్జెట్ గురించి నిర్మాత టెన్షన్ పడుతుంటాడు. 

ALSO READ : నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా : చింతా ప్రభాకర్

కానీ ఇక్కడ ఆ రెండూ నేనే. ముందే ఓ బడ్జెట్ అనుకున్నా. అంతలోనే తీశా. కావాల్సిందే రాసుకున్నా. దాన్నే తీశా. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. నాగార్జున గారి ఫ్యామిలీతో పాటు  మంచు విష్ణు, బ్రహ్మానందం లాంటి ఎంతో మంది నాకు సపోర్ట్‌‌‌‌గా నిలిచారు’ అని చెప్పారు.